ఎంపీ విజయసాయిరెడ్డి, తాను భాగస్వాములు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. అవన్నీ పుకార్లే అని చెప్పారు. తన ఎంవీవీ బిల్డర్స్ సంస్థలో తన భార్య, తానే భాగస్వాములమని వెల్లడించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... విజయసాయిరెడ్డి, తన మధ్య ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని తెలిపారు. తన సంస్థలతో విజయసాయికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అంతేకాకుండా విశాఖ ఎంపీగా తాను గెలిచిన తరువాత ఎక్కడా భూమి కొనలేదని చెప్పారు. ఆరోపణలు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.
'ఆరోపణలు నిరూపిస్తే... పదవికి రాజీనామా చేస్తా' - mvv satyanarayana news
ఎలాంటి తప్పు చేయకపోయినా తనపై పుకార్లు వస్తున్నాయని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. తన సంస్థల్లో ఇతరులకు భాగస్వామ్యం లేదని వెల్లడించారు.

ఎంవీవీ సత్యనారాయణ