ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలి: ఎంపీ భరత్‌

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలని ఎంపీ భరత్‌ అన్నారు. ఉక్కు పోరాటంలో 32 మంది అసువులు బాశారన్న ఎంపీ.. ఉక్కు పరిశ్రమపై ఎంతో మంది కార్మికుల జీవితాలు ఆధారపడి ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉక్కు పరిశ్రమతో విడదీయరాని బంధం ఉందని తెలిపారు.

MP Bharath on Steel plant
MP Bharath on Steel plant

By

Published : Mar 18, 2021, 6:46 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలి: ఎంపీ భరత్‌

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై మరోసారి కేంద్రం పునరాలోచించాలని ఎంపీ మార్గాని భరత్‌ లోక్‌సభలో కోరారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కన్న ఆయన..32 మంది ప్రాణ త్యాగం చేసి పరిశ్రమను సాధించారని గుర్తు చేశారు. ఎంతో మంది కార్మికుల జీవితాలు స్టీల్‌ ప్లాంట్‌పై ఆధారపడి ఉన్నాయన్నారు. ప్రజల ఆకాంక్షను ప్రధాని మోదీకి వివరించి.. ప్రైవేటీకరించకుండా ఒప్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details