విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పుడు కొండవాలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, డ్రైనేజిలు పొంగిపొర్లుతున్నాయని, . దీని వల్ల స్థానికులకు తీవ్ర నష్టం వాటిల్లితోందని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త కేకే రాజు అన్నారు. వర్షాకాలం రాక మునుపే ఈ సమస్యలు ముందుగా గుర్తించి రిటర్నింగ్ వాల్స్ నిర్మాణం, అలాగే డ్రైనేజిలో పూడిక తీత పనులను చేపట్టాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపాముఖ్య నాయకులు, జీవీఎంసీ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
'వర్షాకాలం రాక ముందే సమస్యలు పరిష్కరించండి' - విశాఖ తాజా వార్తలు
కొండవాలు ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు, కొండచరియలు విరిగిపడటం వంటివి గుర్తించి వర్షాకాలం రాక ముందే పనులు పూర్తి చేయాలని వైకాపా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అధికారులకు సూచించారు. కొండవాలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన జీవీఎంసీ అధికారులకు పలు సూచనలు చేశారు.

డ్రైనేజీ పనులను పూర్తి చేయాలంటూ అధికారులకు చెబుతున్న కె కె రాజు