నూతన వధూవరులను వానరం దీవిస్తోందేంటి అని ఆశ్చర్యపోకండి. ఓ కొత్త జంట తలంబ్రాలు పోసుకుంటున్న సమయంలో ఇలా కోతి వారిపై దూకింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటనతో అక్కడ ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట మండలం హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
కొత్త జంటకు కోతి దీవెన.. అదేంటి..!? - మంగపేటలో జరిగిన పెళ్లిలో కొత్త జంటకు కోతి దీవెన
ఓ ఆలయంలో పెళ్లి జరుగుతోంది.. వధూవరులు తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఇంతలో ఓ కోతి వారిపై దూకింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
కొత్త జంటకు కోతి దీవెన
కరోనా కాలంలో ఎంతటి వారి పెళ్లిలోనైన అతిథులే కరువయ్యారు. ఈ సమయంలో తానే విషిష్ఠ అతిథై వానరం.. ఆశీర్వదించింది. ఈ అద్భుత ఘటనతో ఒక్కసారిగా బంధువుల్లో ఆనందం ఉరకలేసింది.
ఇదీ చూడండి:అన్నీ మానవులకేనా... మాకొద్దా..?