ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సెల్‌ఫోన్‌లో మాట్లాడాలంటే.. సాహసం చేయాల్సిందే - విశాఖ మన్యం తాజా వార్తలు

దూరాన ఉన్న స్నేహితులతో మాట్లాడాలన్నా... లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా ..అందరికీ చిటికెలో పని. అందుబాటులో స్మార్ట్‌ఫోన్‌, 4జీ సాంకేతికత ఉంటే.. అరచేతిలోనే ప్రపంచాన్ని చూడొచ్చు. అయితే ఆ ప్రాంతంలో మాత్రం 4G కాదు కదా... కనీసం కాల్స్‌ చేసుకోవడానికైనా సమస్యే.

mobile-signal

By

Published : Nov 11, 2019, 3:17 PM IST

సెల్‌ఫోన్‌లో మాట్లాడాలంటే సాహసం చేయాల్సిందే

విశాఖ మన్యం అంతటా... పచ్చని కొండలు, అటవీ భూములతో సుందరంగా కనిపిస్తాయి. అయితే ఆ కొండల మధ్య నివసించే ప్రజలు... అతి సాధారణమైన సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఈ రోజుల్లో కూడు, గూడు, గుడ్డతో సమానంగా అత్యవసరంగా మారిన సెల్‌ఫోన్‌ను వారి అవసరాలకు తగ్గట్టుగా వినియోగించుకోలేకపోతున్నారు. అరకు, పాడేరు మినహా మిగతా మన్యం ప్రాంతాల్లో సిగ్నల్‌ లేమి వారిని వేధిస్తోంది. సిగ్నల్‌ కోసం కిలోమీటర్ల మేర నడిచి... చెట్లు ఎక్కి సాహసమే చేస్తున్నారు.

ఉద్యోగులు, విద్యార్థులు... రోజువారీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాక... బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పోతోందంటున్నారు. కొన్నిచోట్ల చెట్ల పైకెక్కితే సిగ్నల్స్‌ అంతంతమాత్రంగా వస్తుండటంతో... ఆయా ప్రాంతాలకు ప్రజలు తరలివెళ్తున్నారు.

ఉద్యోగ ప్రకటనలు, ఇంటర్వ్యూల వివరాలు సమయానికి తెలుసుకోలేక అవస్థలు పడుతున్నామని ఈ ప్రాంత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన మేరకు మన్యంలో టవర్లు ఏర్పాటు చేసి సిగ్నల్‌ సమస్య తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

దూడలకు ఘనంగా వివాహం- కారణం అద్భుతం!

ABOUT THE AUTHOR

...view details