ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'భూ కబ్జాలు చేయలేదని అవంతి ప్రమాణం చేయగలరా?' - minister avanthi srinivas news

పర్యటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖలో మంత్రి భారీగా భూ కబ్జాలు చేశారని ఆరోపించారు. తాను భూ ఆక్రమణలు చేయలేదని అవంతి దైవ సాక్షిగా ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు.

mlc manthena satyanarayana raju
mlc manthena satyanarayana raju

By

Published : Dec 28, 2020, 1:19 PM IST

పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రజలకు సేవ చేయడం మరిచి భూముల కబ్జాకు పాల్పడుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విమర్శించారు. విశాఖలో తాను భూ కబ్జాలు చేయలేదని మంత్రి అవంతి దైవ సాక్షిగా ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. జిల్లాలో ఏ గుడికి రమ్మన్నా వస్తామని... అవంతి ఇంట్లో పూజ గదిలోని దేవుని ఫొటోల ముందు ప్రమాణం చేయమన్నా చేస్తామని అన్నారు. దీనికి మంత్రి సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

అవంతి భూదందాపై విశాఖలో చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. వైకాపా హయాంలో విశాఖలో జరిగిన 90 శాతం భూకబ్జాల్లో ఆయన ప్రమేయం ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు అనుచరులు వర్గాలుగా విడిపోయి భూములు ఆక్రమించుకుంటున్నారు. అవంతి అరాచకాలపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు విజయసాయిరెడ్డి వర్గం సిద్ధంగా ఉంది- మంతెన సత్యనారాయణరాజు, తెదేపా ఎమ్మెల్సీ

ABOUT THE AUTHOR

...view details