విశాఖ గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్న కుటుంబసర్వేలో మతం నమోదు కాలమ్ పెట్టడాన్ని భాజపా నేత, ఎమ్మెల్సీ మాధవ్ తప్పుబట్టారు. విశాఖ భాజపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఆదివాసీ ఓ మతంగా కాలమ్ ఇచ్చారన్నారు. గిరిజనులు హిందువుల్లో భాగమేనని మాధవ్ స్పష్టం చేశారు. కానీ అలా కాదని ఇప్పుడు ఆదివాసీ మతాన్ని కొత్తగా తెస్తున్నారని ఆవేదన చెందారు.
ఆ సర్వేలో మత అంశాలను తేవడం సరికాదని మాధవ్ అన్నారు. ఆదివాసీల్లో విభజన చేయడం మానుకోవాలన్నారు. కుటుంబ సర్వేలో ఆదివాసీ అని ఎంపిక చేసుకునే విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.