ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు సంబంధించి హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. కమిటీ నివేదిక ప్రభుత్వ అసమర్ధతను, కంపెనీలోని లోపాలను బయటపెట్టిందన్నారు. ప్రభుత్వ లోపాలు, కంపెనీ తప్పిదాల వల్లే ప్రమాదం జరిగిందని నిర్దరణ అయిందన్నారు.
'ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి' - latest news on ashok babu
ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. హైపవర్ కమిటీ నివేదిక ప్రభుత్వ అసమర్ధతను, కంపెనీలోని లోపాలను బయటపెట్టిందన్నారు.
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై అశోక్ బాబు
దీనిపై విజయసాయిరెడ్డి ఏం చెబుతారని ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ మేనేజ్ మెంట్ని అరెస్ట్ చేయాలని వైకాపా ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ అశోక్బాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రూ.20వేల కోట్ల ఆస్తిని...30 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాం: సీఎం