వైకాపా నేతలు తనపై చేసిన ఆరోపణలపై నిజాయితీగా విచారణ చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. తన సచ్చీలతను నిరూపించుకుంటూ.. ఈస్ట్ పోయింట్ కాలనీలో వున్న షిరిడీ సాయి బాబా గుడిలో ప్రమాణం చేస్తానని అన్నారు. బాబా కోవెలకు ఎప్పుడు విజయసాయి రెడ్డి వస్తారో చెప్తే తాను వస్తానని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు విజయసాయిరెడ్డి నిరూపించకపోతే రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక వేళ తన బినామీలదే స్థలమని రుజువైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెలగపూడి సవాల్ విసిరారు. రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నానే తప్ప ఒక్క రూపాయి కూడా సంపాదించకున్నది లేదని రామకృష్ణబాబు స్పష్టం చేశారు.
రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నా.. సవాల్‌కు సిద్ధమా?: వెలగపూడి - ఎమ్మెల్యే వెలగపూడిపై అవినీతి ఆరోపణలు న్యూస్
వైకాపా నేతలు కబ్జా చేయడానికే ఆక్రమణలు తొలగిస్తున్నారని.. వాటిని తన బినామి ఆస్తులుగా చూపిస్తూ.. ఆరోపణలు చేస్తున్నారని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎంవీపీ కాలనీలో ఒకే ఫ్లాట్ ఉందని.. తనపై, తన కుటుంబ సభ్యుల పేరు మీద సెంటు స్థలం లేదని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నా.. సవాల్‌కు సిద్ధమా?: వెలగపూడి
TAGGED:
mla velagapudi latest news