ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ కేజీహెచ్​ను కరోనా ఆస్పత్రిగా మార్చొద్దు-గవర్నర్​కు వాసుపల్లి లేఖ - ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వార్తలు

విశాఖ కేజీహెచ్​ను కరోనా ఆస్పత్రి చేయొద్దంటూ ఏపీ గవర్నర్​కు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ లేఖ రాశారు. ప్రతిరోజు 2వేల మంది అనేక రోగాలతో బాధపడే రోగులు అవుట్ పేషెంట్లుగా వస్తుంటారని లేఖలో పేర్కొన్నారు.

mla-vasupalli-letter-to-governor
mla-vasupalli-letter-to-governor

By

Published : Apr 12, 2020, 8:50 PM IST

విశాఖ కేజీహెచ్​ను కరోనా ఆస్పత్రిగా మార్చొద్దని గవర్నర్​కు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ లేఖ రాశారు. నిత్యం అనేక సమస్యలతో వేల మంది రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారని...హృద్రోగులు, డయాలసిస్, ప్రసూతి, ఎముకల వైద్యం చేయించుకునేవారు వచ్చే ఏకైక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి కేజీహెచ్ అని ఆయన లేఖలో వివరించారు. ఇది కరోనా వైద్యం కోసం కేటాయిస్తే మిగిలిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని లేఖలో పేర్కొన్నారు. కేజీహెచ్ ను జనరల్ ఆసుపత్రిగానే కొనసాగించడం వల్ల ఎక్కువమందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర వాసుల అతి పెద్ద ఆసుపత్రి అయిన కేజీహెచ్ ను సాధారణ వైద్యం కోసం వినియోగించుకోవాలని వాసుపల్లి కోరారు.

ABOUT THE AUTHOR

...view details