MLA Vasupalli Ganesh kumar: విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త పదవికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, వాసుపల్లికి మధ్య విభేదాలు నేలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బహిరంగంగానే వాసుపల్లి మీడియా ముందు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఇరువురి నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమైనట్లు తెలుస్తోంది.
వైకాపా సమన్వయకర్త పదవికి ఎమ్మెల్యే వాసుపల్లి రాజీనామా - విశాఖ తాజా వార్తలు
MLA Vasupalli Ganesh kumar resigned: వైకాపా సమన్వయకర్త పదవికి విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ రాజీనామా చేశారు. నేతల తీరుతో తన గౌరవానికి భంగం కలిగిందని లేఖలో పేర్కొన్నారు.
MLA Vasupalli Ganesh kumar resigned
నేతల మధ్య విభేదాల నేపథ్యంలో బలనిరూపణ చేసుకోవాలని వాసుపల్లి గణేశ్‌కు వైకాపా నేతలు సూచించినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన వాసుపల్లి గణేశ్ కుమార్.. తాజాగా విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైవీ సుబ్బారెడ్డి, విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు అవంతికి పంపారు. నేతల తీరుతో తన గౌరవానికి భంగం కలిగిందని లేఖలో వాసుపల్లి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Jun 4, 2022, 4:19 PM IST