తాను పార్టీ మారుతున్నట్లు చాలాసార్లు ప్రచారం జరిగిందని.. దాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గంటా పార్టీ మారే అవకాశముందటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. విజయసాయిరెడ్డి ఏ లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. సీఎంకు తాను ఎలాంటి ప్రతిపాదనలు పంపానో ఆయనే చెప్పాలని గంటా పేర్కొన్నారు.
పార్టీ మార్పుపై స్పందించిన గంటా..ఏమన్నారంటే..? - గంటాపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
తాను పార్టీ మారుతున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు.తాను పార్టీ మారుతున్నట్లు చాలాసార్లు ప్రచారం జరిగిందని.. దాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు.
mla ganta srinivasa rao