ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేటీకరణ చేయబోమని భాజపా నేతలు ఎందుకు చెప్పరు..? గంటా - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ

విశాఖ ఉక్కు పరిశ్రమపై భాజపా నేతల తీరును తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తప్పుబట్టారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణ చేయబోమని ఆ పార్టీ నేతలు ఎందుకు చెప్పరని నిలదీశారు.

తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
mla ganta srinivasa rao fiers on bjp

By

Published : Feb 21, 2021, 12:57 PM IST

విశాఖ ఉక్కు ఉద్యమంపై భాజపా తప్పుదోవ పట్టిస్తోందని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటీకరణ చేయబోమని భాజపా నేతలు ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. సొంత గనుల కోసం తెదేపా ఎప్పటినుంచో పోరాడుతోందని.. 2006లోనే పార్లమెంటులో ఎర్రన్నాయుడు గళమెత్తారని గుర్తు చేశారు. ఇంకా ఏమీ జరగలేదని భాజపా చెప్పడం ప్రజలను మోసగించడమేనని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details