తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా - విశాఖ ఉక్కు కర్మాగారం తాజా వార్తలు
14:24 February 06
.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. సొంత దస్తూరితో రాసిన లేఖను స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందజేశారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధులంతా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని గంటా నిన్న ప్రకటించారు. చెప్పిన విధంగానే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదు'