గత అసెంబ్లీ సమావేశాల్లో విశాఖలో రోడ్ల మరమ్మతులు, తదితర అభివృద్ధి పనులు ఎప్పుడు చేస్తారని ఎమ్మెల్యే గణబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నేడు ప్రభుత్వం నుంచి ఆ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. అక్టోబర్-2020 కల్లా పనులు పూర్తి చేస్తామని లేఖలో పేర్కొన్నట్లు వివరించారు. అయితే ప్రస్తుతం గుత్తేదార్లు ఎవరూ పని చేయనందున.. నెలరోజుల్లో ఎలా పూర్తి చేస్తారని గణబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డ్రెయిన్లు, కొండవాలు రిటైనింగ్ పనులు చూస్తుంటే అవి ఇప్పుడు పూర్తయ్యేలా లేవని.. మరి ఏ సాంకేతిక పరిజ్ఞానంతో నెలరోజుల్లో పూర్తిచేస్తారో సమాధానం చెప్పాలని ఎద్దేవా చేశారు.
'ఏ సాంకేతిక పరిజ్ఞానంతో నెల రోజుల్లో పనులు పూర్తి చేస్తారు' - విశాఖ ఎమ్మెల్యే గణబాబు తాజా వార్తలు
'విశాఖ జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు ఆపేసి 6 నెలలు అవుతోంది. ప్రస్తుతం గుత్తేదార్లు ఎవరూ పనులు చేయడం లేదు. మరి వచ్చే నెలాఖరుకు రోడ్ల మరమ్మతులు, డ్రెయిన్లు, కొండవాలు రిటైనింగ్ వాల్ పనులు ఎలా పూర్తి చేస్తారు' అని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

గణబాబు, విశాఖ ఎమ్మెల్యే