కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే గణబాబు విమర్శించారు. విశాఖ గోపాలపట్నం క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వ తీరును ఖండిస్తూ.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన స్వగృహం గోపాలపట్నంలో నిరసన దీక్ష చేపట్టారు. విశాఖ నగరంలోని కరోనా కేంద్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా కట్టడిలో వైకాపా ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే గణబాబు
కరోనా కట్టడిలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు విమర్శించారు. అందుకు నిరసనగా ఆయన స్వగృహం గోపాలపట్నంలో నిరసన దీక్ష చేపట్టారు.
ఎమ్మెల్యే ఘన బాబు