ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్ఏడీ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే గణబాబు పరిశీలన - nad fly over in vishaka news

విశాఖలోని ఎన్​ఏడీ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే గణబాబు మంగళవారం పరిశీలించారు. ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

mla gana babu
mla gana babu

By

Published : Oct 27, 2020, 11:42 PM IST

విశాఖలో నిర్మిస్తున్న ఎన్​ఏడీ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు మంగళవారం పరిశీలించారు. అక్కడి ఇంజినీరింగ్ అధికారులను అడిగి నిర్మాణ పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే కొంత శాతం పనులు పూర్తవటంతో రెండు లైన్లు వాహనదారులకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. మిగిలిన పని త్వరగా ముగించి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details