పెందుర్తిలో జరిగిన శిరోముండన ఘటన బాధాకరమని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు అన్నారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఘటనలో భాగస్వామ్యం ఉన్న వారిని 24 గంటల్లోగా కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించామని చెప్పారు. నూతన్ నాయుడు జనసేనకు సన్నిహితంగా ఉన్నారని అన్నారు. కానీ నూతన్ నాయుడు వైకాపా మనిషి అని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని...అతడితో వైకాపాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బాధితుడైన శ్రీకాంత్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని, ఉద్యోగంతో పాటు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనలో నూతన నాయుడు ప్రమేయం ఉంటే చర్యలు తప్పవని తెలిపారు.
నూతన్‌నాయుడితో వైకాపాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే అదీప్ రాజు - పెందుర్తిలో శిరోముండనం
శిరోముండన ఘటన చాలా బాధాకరమని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు అన్నారు. నిందితులపై 24 గంటల్లో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారని చెప్పారు. నూతన్ నాయుడితో వైకాపాకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
mla adeep raj