ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నగరాల్లో చిట్టడవుల సృష్టికి మియావకి పద్ధతి దోహదం చేస్తుంది' - Revenue Colony Residential Welfare Association latest news update

విశాఖ ప్రజలు మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటుతున్నారు. మియావకి విధానంలో జీవీఎంసీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంఘం ఏకంగా 3,400 మొక్కలు నాటారు.

miyawady plantation
మియావకి విధానంలో మొక్కలు నాటుతున్న పిల్లలు

By

Published : Dec 10, 2020, 8:12 AM IST

విశాఖ మధురవాడలో మియావకి విధానంలో 3,400 మొక్కలను నాటి ప్రజలు హరిత స్ఫూర్తిని చాటారు. జీవీఎంసీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 28 రకాల మొక్కలను కాలనీ ప్రజలంతా కలిసి నాటారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచడం ద్వారా నగరాల్లో చిట్టడవుల సృష్టించేందుకు మియావకి పద్ధతి దోహదం చేస్తుందన్నారు. విశాఖలో పెద్ద ఎత్తున మియావకి విధానాన్ని ప్రోత్సహించే దిశగా జీవీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు స్థానికులు తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించే దిశగా ప్రజలు ముందుకు రావటం పట్ల జీవీఎంసీ కమిషనర్ సృజన హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని కాలనీలకు చెందిన ప్రజలు ఈ తరహా కార్యక్రమాలను చేపట్టాలని.. అందుకు జీవీఎంసీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని కమిషనర్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details