ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తమ్ముడు అని ఆత్మీయంగా పిలిచేవారు : మిథునం నిర్మాత - ఎస్పీ బాలు మృతి వార్తలు

ఎస్పీ బాలు పసిబాలుడని, ఆత్మీయులకు ఆయన ఎంతో విలువ ఇచ్చేవారని మిథునం సినిమా నిర్మాత ఎం.ఆనందరావు అన్నారు. బాలు గానమాధుర్యం ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. తనను తమ్ముడు అని ప్రేమగా పిలిచేవారని ఆయన గత స్మృతులను గుర్తుచేసుకున్నారు.

మిథునం నిర్మాత
మిథునం నిర్మాత

By

Published : Sep 25, 2020, 5:42 PM IST

మిథునం ఒక్క సినిమాతో... నాలుగు నంది అవార్డులు పొందిన గొప్పనటుడు ఎస్పీ బాలు అని ఆ చిత్ర నిర్మాత ఎం.ఆనందరావు అన్నారు. మిథునం-2 సినిమా కోసం మాట్లాడిన కొద్దీ రోజులకే ఇలా జరగడం దురదృష్టమని ఆయన తెలిపారు. బాలు.. పసిబాలుడని, ఆయన మనస్తత్వం చిన్నపిల్లాడిలా ఉంటుందని చెప్పుకొచ్చారు. మిథునం చిత్ర సమయంలో చాలా ఆత్మీయ అనుబంధం ఏర్పడిందని చెప్పారు. ఎంత పనిలో ఉన్న ఆత్మీయులకు విలువనిచ్చే వారన్నారు.

బాలు గాన మాధుర్యం ఎప్పటికీ మరువలేనిదని ఆనందరావు చెప్పారు. బాలు.. వారి గురువు ఘంటసాల పట్ల అమితమైన ప్రేమ చూపేవారన్నారు. మిథునం సినిమా సమయంలో ఎంతో ఆత్మీయత ఏర్పడిందని అన్నారు. తమ్ముడు అని ప్రేమగా పిలిచే బాలు లేకపోవడం బాధగా ఉందని ఆవేదన చెందారు.

ఇదీ చదవండి :'ఇంత త్వరగా మమ్మల్ని వీడి వెళతాడనుకోలేదు'

ABOUT THE AUTHOR

...view details