కరోనాకట్టడి, బాధితులకు మెరుగైన సేవలు అందించడంలో.. విమర్శలకు తావులేకుండా సమష్టిగా పనిచేయాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. రోగులకు పడక లేదనకుండా వైద్యం అందిస్తామని చెప్పారు. విశాఖ జిల్లాలోని 79 కొవిడ్ఆస్పత్రుల్లో 5,700 మందికి వైద్యం అందిస్తున్నామన్న మంత్రి ముత్తంశెట్టి.. ఆక్సిజన్ కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని వివరించారు. 1,443 ఆరోగ్యశ్రీ బెడ్‌లు ఉన్నాయని.. వాటిని ఇంకా పెంచుతామని పేర్కొన్నారు.
రోగులకు పడక లేదనకుండా వైద్యం అందిస్తాం: మంత్రి ముత్తంశెట్టి - Minister Srinivasa Rao comments on Corona
రోగులకు పడక లేదనకుండా వైద్యం అందిస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. విశాఖ జిల్లాలోని 79 కొవిడ్ ఆస్పత్రుల్లో 5,700 మందికి వైద్యం అందిస్తున్నట్టు వెల్లడించారు. ఆక్సిజన్ కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.
మంత్రి ముత్తంశెట్టి