ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తోంది : మంత్రి ముత్తంశెట్టి - విశాఖ జిల్లా నేటి వార్తలు

విశాఖ జిల్లా భీమునిపట్నం మంగమారి పేటలో మత్స్యకారుల కోసం నిర్మించిన షెల్టర్లను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. చేపలు వేలం వేసుకోవడానికి, ఎండబెట్టుకోడానికి, వలల కుట్టుకోడానికి షెల్టర్లు ఉపయోగపడతాయన్నారు. మత్స్యకారుల అభ్యున్నతికి వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు.

Minister muttamsetti srinivasrao
Minister muttamsetti srinivasrao

By

Published : Oct 16, 2020, 8:32 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం మంగమారి పేటలో కోటి రూపాయల నిధులతో మత్స్యకారుల కోసం ఏర్పాటుచేసిన షెల్టర్లను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. మత్య్సకారులకు మౌలిక సదుపాయాల కల్పనకు, చేపలు, వలలు భద్రపరిచుకునేందుకు షెల్టర్లు నిర్మించామన్నారు. మత్స్యకారులు అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.

మత్స్యకారుల మౌలిక సదుపాయాల భవనాన్ని ప్రారంభిస్తోన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ఈ షెల్టర్ల వల్ల గ్రామంలో సుమారు 5 వేల మంది జీవనాధారం మెరుగుపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. చేపలు వేలం వేసుకోడానికి, వలలు కుట్టుకోవడానికి, చేపలు ఎండబెట్టుకోవడానికి షెల్టర్ల ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గోవిందరావు, మత్స్యశాఖ జేడీ కె.ఫణిప్రకాశ్​ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తగరపువలసలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న కాల్వలకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఇదీ చదవండి :'దసరాకైనా తెలంగాణలోకి బస్సులు అనుమతిస్తారని ఆశిస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details