ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ అభివృద్ధికి అందరూ కలిసి రావాలి: మంత్రి ముత్తంశెట్టి - విశాఖ జిల్లా తాజా వార్తలు

విశాఖ మహా నగర పాలక సంస్థ పరిధిలో రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలని, సమస్యలుంటే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విశాఖ నగరంలో పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

muttamsetti srinivasarao
muttamsetti srinivasarao

By

Published : Oct 17, 2020, 7:26 PM IST

విశాఖ మహా నగర పాలక సంస్థ పరిధిలోని 8 నియోజకవర్గాల్లో రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖ పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరారు. బీఆర్​టీస్ రోడ్డు త్వరలోనే పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేయాలని కోరారు.

జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ, సచివాలయాల పనితీరు, పలు అంశాలపై ఆయన స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష నిర్వహించారు. సాంకేతిక సమస్యలతో సంక్షేమ పథకాలు కొంతమంది ప్రజలకు చేరడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, ఆ సమస్యలు రాకుండా చూడాలని మంత్రి కోరారు. భూకబ్జాలను అడ్డుకుంటున్నామన్నారు. విశాఖ మహానగర పరిధిలోని 98 వార్డులలో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details