ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరామర్శించారు. కేజీహెచ్ రాజేంద్రప్రసాద్ వార్డులో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. అలాగే వారికి అందుతున్న వైద్య సేవల గురించి కేజీహెచ్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లల వార్డులోకి వెళ్లి గాయపడ్డ చిన్నారులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
విశాఖ బాధితులకు మంత్రి గౌతమ్ రెడ్డి పరామర్శ - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ
విశాఖ ఘటనలో బాధితులను పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

minister mekapati gowtham reddy