విశాఖలో పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, కొత్త పరిశ్రమల స్థాపనపై చర్చించేందుకు.. జిల్లా ఇంఛార్జి మంత్రి కె.కన్నబాబు సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపి విజయసాయి రెడ్డి సహా జిల్లా అధికారులు హాజరయ్యారు.
పారిశ్రామిక సమస్యలపై మంత్రి కన్నబాబు సమావేశం - పారిశ్రామిక సమస్యలపై విశాఖలో మంత్రి కన్నబాబు సమావేశం
విశాఖలో కొత్త పరిశ్రమల స్థాపన, పారిశ్రామిక రంగ సమస్యలపై.. ఆ జిల్లా ఇంఛార్జి మంత్రి కన్నబాబు నగరంలో సమావేశం నిర్వహించారు. సింగిల్ డెస్క్ విధానం వల్ల.. నూతన సంస్థలకు ఆహ్వానం పలికినట్లవుతుందని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు.

సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎంపీ
కొత్త పరిశ్రమలు విరివిగా రావడానికి, అనుమతుల మంజూరుకు.. సింగిల్ డెస్క్ విధానం ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. పరిశ్రమ వర్గాలు, బ్యాంకింగ్, ఇతర ఔత్సాహికులు.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:విజయసాయిరెడ్డి లేఖపై భాజపా నేతల అభ్యంతరం