విశాఖలో 63 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. కరోనా నిర్ధరణకు జిల్లా వ్యాప్తంగా 6 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విశాఖలో 18 చోట్ల ట్రూనాట్ టెస్టులు చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఆస్పత్రుల్లో 6,763 పడకలు ఉన్నట్లు చెప్పారు.
విశాఖలో 6 వేలకు పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు: మంత్రి కన్నబాబు - విశాఖ కరోనా తాజా వార్తలు
విశాఖలో రోజుకు 6 వేలకు పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్‌లో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేజీహెచ్‌లో చిన్నారి చనిపోయిన విషయంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.
kannababu
విశాఖలో 1,047 ఐసీయూ , 780 వెంటిలేటర్ పడకలున్నాయన్నారు. జిల్లాలో 7,072 రెమ్ డిసివిర్ ఇంజక్షన్లు ఉన్నట్లు చెప్పారు. చింతపల్లిలోనూ కొవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: కరోనాతో షార్ట్ ఫిలిమ్స్ నటి అంజలి ఘోష్ మృతి