ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో 2 రోజులు భారీ వర్షాలు.. సమీక్షించిన మంత్రులు - ఏపీ వర్షాల వార్తలు

విశాఖ జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఇవాళ, రేపు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించిందని కన్నబాబు అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, సహాయచర్యలు చేపట్టాలని సూచించారు.

విశాఖ జిల్లాలో వర్షాలపై మంత్రులు సమీక్ష
విశాఖ జిల్లాలో వర్షాలపై మంత్రులు సమీక్ష

By

Published : Oct 12, 2020, 7:39 PM IST

Updated : Oct 12, 2020, 7:48 PM IST

జిల్లాలో వర్షాలు, ముంపు, సహాయ చర్యలపై మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలోసమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపిందని మంత్రి కన్నబాబు అన్నారు.

ప్రాణనష్టం జరగకుండా, సహాయచర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేశామని కన్నబాబు అన్నారు. వర్షం ఆగిన వెంటనే పంటనష్టం అంచనా వేస్తామన్నారు. పారిశుద్ధ్యం విషయంలో జీవీఎంసీ అధికారులు అప్రమత్తం కావాలన్నారు.

Last Updated : Oct 12, 2020, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details