Minister Amar fired on Pawan Kalyan: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన దాఖలాలు చంద్రబాబుకు లేవని ఆరోపించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెదేపా అని ఎన్టీఆర్ చెప్పేవారని.. అలాంటిది గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు.
"బాబు బ్యానర్లో.. పవన్ హీరోగా దత్తపుత్రుడు సినిమా.. ఫ్లాప్ ఖాయం" - Minister Amar fired on Pawan Kalyan
Minister Amar fired on Pawan Kalyan: పవన్ కళ్యాణ్, చంద్రబాబు దత్త పుత్రుడేనని..బాబు ఆశయాల కోసమే అధినేత పని చేస్తున్నాడని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. రైతుల గురించి మాట్లాడే హక్కు పవన్ కు లేదని తేల్చి చెప్పారు.
!["బాబు బ్యానర్లో.. పవన్ హీరోగా దత్తపుత్రుడు సినిమా.. ఫ్లాప్ ఖాయం" Minister Gudiwada Amarnath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15102918-537-15102918-1650802630989.jpg)
పవన్ కళ్యాణ్, చంద్రబాబు దత్త పుత్రుడేనని.. బాబు ఆశయాల కోసమే జనసేన అధినేత పని చేస్తున్నాడని ఆరోపించారు. పవన్ కు జగన్ కేసుల గురించి పూర్తిగా తెలియదన్నారు. జైలుకు వెళ్లడం, శిక్షకు మధ్య తేడా పవన్ కళ్యాణ్ కి తెలుసా? అని ప్రశ్నించారు. ఏ ఒక్క కేసులో జగన్ దోషిగా నిరూపించబడలేదని, అది కాంగ్రెస్ చేసిన కుట్ర అని అందరికీ తెలుసని అన్నారు. ప్రజలకు ఆ నిజాలు తెలుసు కనుకనే 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించారని అన్నారు. ఐదు సంవత్సరాలలో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకున్న రికార్డ్ పవన్ కళ్యాణ్‌కు ఉందని, చంద్రబాబు బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హీరోగా దత్త పుత్రుడు సినిమా తీస్తున్నారన్న ఆయన.. ఆ సినిమా ప్లాప్ అవ్వడం ఖాయమని ఎద్దేవా చేశారు. రైతులు కోసం మాట్లాడే కనీస హక్కు కూడా పవన్ కళ్యాణ్ కి లేదని మంత్రి చెప్పుకొచ్చారు. విశాఖ వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అమర్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి :నరసరావుపేట హత్య నిందితులను పోలీసులు పట్టేశారు.. ఎవరంటే?