'విశాఖలో మెట్రోరైల్ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభిస్తాం' - viskha metro latest news
విశాఖలో 2, 3 రోజుల్లో మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభించనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్ పూర్తయిందన్న మంత్రి బొత్స... స్మార్ట్ సిటీ బడ్జెట్ రూ.వెయ్యి కోట్లుగా నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే రూ.300 కోట్ల పనులు పూర్తయ్యాయని వివరించారు. విశాఖకు 24 గంటలూ నీటి సౌకర్యం కోసం గోదావరి నుంచి పైప్‌లైన్ వేస్తామని చెప్పారు.
మంత్రి బొత్స సత్యనారాయణ