రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘హోదా’ సాధించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. విజయనగరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో బొత్స మాట్లాడారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం ఉందని.. దీనిపై సీఎం జగన్ పలు దఫాలుగా కేంద్రంతో ప్రస్తావిస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని చెప్పినా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని.. అది తమ విధానమని చెప్పారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని బొత్స పునరుద్ఘాటించారు.
పరిపాలన రాజధానిగా విశాఖ.. అదే మా విధానం : బొత్స - బోత్స తాజా వార్తలు
ప్రత్యేక హోదా, రాజధాని అంశాలపై రాష్ట్ర మంత్రి బోత్స సత్యనారాయణ స్పందించారు. హోదా విషయంలో రాజీ పడేదే లేదన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
minister botsa on three capitals