ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చివరి మృతదేహం దొరికే వరకూ గాలింపు ఆగదు' - latest news on boat accident

బోటు ప్రమాదాలు, నివారణ చర్యలపై విశాఖ కలెక్టరేట్​లో మంత్రి అవంతి శ్రీనివాస్​  సమీక్ష నిర్వహించారు.

బోటు ప్రమాదాలపై మంత్రి అవంతి ​ సమీక్ష

By

Published : Sep 19, 2019, 3:20 PM IST

చివరి మృతదేహం దొరికే వరకూ గోదవరిలో గాలింపు చర్యలు కొనసాగుతాయని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్​ అన్నారు. నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఛత్తీస్‌గఢ్‌ దళాలు చాలా శోధిస్తున్నాయని తెలిపారు. పర్యాటకశాఖ అభివృద్ధి, బోటు ప్రయాణాలు, ప్రమాదాలు, నివారణ చర్యలపై విశాఖ కలెక్టరేట్​లో సమీక్ష నిర్వహించారు.
మృతదేహాలను గౌరవప్రదంగా కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నామని వెల్లడించారు. నది, సముద్రంలో ప్రమాద మార్గంలో బోట్లు వెళ్లకుండా సూచికలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు పర్యాటక ప్రాంతంలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో బోటు ప్రయాణికుల వివరాలు తీసుకోవాలని... వారి ఫొటో, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరిగా సేకరించాలని అధికారులను సూచించారు. వరదల వల్ల ఇసుక కొరత ఉన్న మాట వాస్తవమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details