విశాఖ తోట్లకొండలోని బౌద్ధ స్థూపాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పునః ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న ఈ స్థూపాన్ని ప్రజల సందర్శనార్ధం తిరిగి మరమ్మతులు చేశారు. ఇదే సమయంలో బౌద్ధ క్షేత్ర చారిత్రక అంశాలను తెలిపే భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరింత ఆకర్షణీయంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
తొట్లకొండలో స్థూపాన్ని పునః ప్రారంభించిన మంత్రి అవంతి
విశాఖలో గౌతమబుద్దుడు నడిచిన నేలగా పిలిచే తోట్లకొండలో బౌద్ధ స్థూపాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పునః ప్రారంభించారు.
మాట్లాడుతున్న మంత్రి అవంతి శ్రీనివాస్