సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని మంత్రి అవంతి శ్రీనివాసరావు(Minister Avanthi Srinivas) దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు.
స్వామివారి కృపతో కొవిడ్ సమస్యతోపాటు..పంచగ్రామాల భూసమస్య తీరిపోతుందని మంత్రి తెలిపారు. దేవస్థానం అభివృద్ధి విషయంలో ఈవో సూర్యకళ విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఆమెకు అందరూ సహకరించాలని కోరారు. భక్తులకు మరిన్ని వసతి గదులు అందుబాటులోకి తేవాలని ఈవోకు సూచించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.