సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొన్న మంత్రి... స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ భక్తులకు సకాలంలో దర్శనభాగ్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శానిటైజర్, మాస్కులు భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు.
సింహాచలం అప్పన్న సేవలో మంత్రి అవంతి - సింహాచలంలో మంత్రి అవంతి న్యూస్
మంత్రి అవంతి శ్రీనివాస్ సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సింహాచలం అప్పన్న సేవలో మంత్రి అవంతి