విశాఖ సింహాద్రి అప్పన్నను మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం తాత్కాలిక పందిళ్లు, మంచి నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
ఆలయంలో రద్దీ..
నిన్న ఆలయంలో స్వామివారి కల్యాణం కారణంగా... భక్తులను దర్శనాలకు అనుమతించలేదు. ఈ కారణంగా.. నేడు స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఆలయం రద్దీగా మారింది. అలాగే.. శనివారమూ తోడైన కావడంతో దూరప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు కరోనా నిబంధనలు పాటించి తమకు సహకరించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. టికెట్ కౌంటర్ వద్ద శానిటైజర్ అందిస్తున్నారు.