చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖలో అన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా, 40 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చంద్రబాబు.... అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం బాధ్యతారాహిత్యమన్నారు. రాష్ట్రానికి ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పారు. అమరావతి ప్రాంతానికే మద్దతైతే ఉత్తరాంధ్రలో గెలిచిన ఎమ్మెల్యేలను తేదేపా రాజీనామా చేయించాలని అవంతి సవాల్ చేశారు. పార్లమెంట్లో సవరణల ద్వారా మూడు రాజధానులు ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. చంద్రబాబు తానా అంటే పవన్ కల్యాణ్ తందానా అంటున్నారని విమర్శించారు. అమరావతిపై పవన్‌కు ప్రేమ ఉంటే గాజువాక నుంచి ఎందుకు పోటీ చేశారని మంత్రి ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తారా?: అవంతి
తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి.... అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం ఏంటని ప్రశ్నించారు.
minister avanthi srinivas sensational comments on chandrababu