విశాఖ జిల్లాలో కొవిడ్ నియంత్రణపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. కొవిడ్ ఆసుపత్రుల్లో 2 వేల పడకలు అందుబాటులో ఉంచినట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ జిల్లాలో ఆక్సిజన్‌తో కూడిన 1,022 పడకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,548 పడకలు ఏర్పాటు చేసినట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చెప్పారు.
కొవిడ్ ఆసుపత్రుల్లో 2వేల పడకలు సిద్ధం: మంత్రి అవంతి శ్రీనివాసరావు - విశాఖ జిల్లాలో కరొనా వైద్య సేవలు
విశాఖ జిల్లాలో కొవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టినట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్ ఆసుపత్రుల్లో 2 వేల పడకలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,548 పడకలు ఏర్పాటు చేశామన్నారు.
minister avanthi srinivas
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ఆరోగ్యశ్రీ సేవల్లో చేర్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 4.60 లక్షల మందికి కొవిడ్ టీకాలు ఇచ్చినట్లు వెల్లడించారు. కేజీహెచ్‌లో 3 షిఫ్టుల్లో అందుబాటులో 80 మంది వైద్యులు ఉంటున్నారని మంత్రి శ్రీనివాస్ అన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 5,963 కేసులు, 27 మరణాలు