విశాఖలో కొవిడ్ నివారణపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.... జిల్లాలో తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. ఇప్పటివరకు విశాఖ జిల్లావ్యాప్తంగా 17448 పాజిటివ్ కేసులు వచ్చాయని...వారిలో 9వేల మందికిపైగా డిశ్చార్జ్ అయినట్లు వివరించారు.
కరోనా వ్యాప్తి నియంత్రణకు పటిష్ట చర్యలు : మంత్రి అవంతి
విశాఖ జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలను పెంచుతూ....బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని వివరించారు.
minister avanthi srinivas
15వేల మంది వరకు హోం క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. కేజీహెచ్‌లో అదనంగా మరో 500 పడకలను వారం రోజుల్లో సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు పెంచుతూ...జిల్లాలోఅదనంగా 145 మంది వైద్యులను కొత్తగా నియమించామన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు మరింత పటిష్టంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.