తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్థాయి మరిచి ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి గురించి మాట్లాడుతున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై మంత్రి స్పందించారు. ఇళ్ల పట్టాల కార్యక్రమం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు అనుచరుల్ని ఈ విధంగా రెచ్చగొడుతున్నారని అవంతి విమర్శించారు. వెలగపూడి రామకృష్ణబాబు విశాఖలో ఎన్నో అరాచకాలు, భూకబ్జాలు చేశారని ఆరోపించారు. వీటన్నింటికి సాక్ష్యాలు ఉన్నాయని... కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వెలగపూడి స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: మంత్రి అవంతి - minister avanthi Srinivas news
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సవాల్ విసరడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇదంతా చంద్రబాబు డ్రామా అని విమర్శించారు. ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇదంతా చేస్తున్నారని మంత్రి అన్నారు.
minister avanthi srinivas