ప్రభుత్వ భూమి అక్రమించుకుంటే ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే స్వాధీనం చేసుకోవచ్చని మంత్రి అవంతి శ్రీనివాసరావు (minister avanthi srinivas) అన్నారు. విశాఖలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ భూములు అక్రమించుకుంటే వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. చాలామంది మాజీ శాసన సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు విశాఖలోని చాలా చోట్ల భూములు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు. మొత్తం 430 ఏకరాలు అక్రమించుకున్నారని వెల్లడించారు. వాటి విలువ 4 వేల కోట్ల రూపాయలు ఉంటుందని, అలాంటి భూమిని కాపాడుతున్నామని చెప్పారు. ఒక్క భీమిలి (bheemili) నియోజకవర్గంలోనే రూ.200 కోట్ల విలువైన భూమిని కాపాడమని.. 95 అక్రమణలను తొలగించామని వివరించారు. భూ అక్రమాలపై ప్రజలు స్పందించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు(chandrababu)తో పాటు ఆ పార్టీ నేతల ఆలోచన విధానం మార్చుకోవాలని హితవు పలికారు.
'విశాఖలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటాం. మాజీ ఎమ్మెల్యేలు, నేతలు విశాఖలో భూములు ఆక్రమించారు. విశాఖలో మొత్తం 430 ఎకరాలు ఆక్రమించుకున్నారు. రూ.4 వేల కోట్ల విలువైన భూములు కాపాడుతున్నాం. విశాఖలో ఆక్రమణలపై సినిమా పూర్తి కాలేదు.. ఇంకా ఉంది. ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటే ఎలాంటి నోటీసు ఇవ్వనక్కర్లేదు. ఆక్రమించుకున్నవారు స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వాలి' - అవంతి శ్రీనివాస్, మంత్రి