భాజపా రాష్ట్ర నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైల్వే జోన్ హామీ దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబునాయుడులా మాట్లాడొద్దని హితవు పలికారు. తెదేపా ఐదేళ్ల పాలనలో ఒక్కటైనా శాశ్వత భవనం కట్టలేదని విమర్శించారు. రాష్ట్రమంటే 29 గ్రామాల ప్రజలేనా అని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులకు న్యాయం చేస్తామని తమ ప్రభుత్వం మొదట్నుంటి చెబుతోందని స్పష్టం చేశారు.
'చిత్తశుద్ధి ఉంటే రైల్వే జోన్‌పై ఒత్తిడి తీసుకురండి'
భాజపా నేతల తీరును మంత్రి అవంతి తప్పుబట్టారు. రెఫరెండంపై ఆ పార్టీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు బాటలో నడవొద్దని హితవు పలికారు. సోము వీర్రాజుకు చిత్తశుద్ధి ఉంటే రైల్వే జోన్ అంశంపై మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
minister avanthi srinivas
TAGGED:
విశాఖ రైల్వే జోన్ వార్తలు