ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బోటు ప్రమాదాలు జరగకుండా కమాండ్ కంట్రోల్ కేంద్రం పర్యవేక్షణ' - అవంతి న్యూస్

కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత వాటి కార్యకలాపాలు ఆగిపోయాయని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బోట్లలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా... బోట్లను కమాండ్ కంట్రోల్ కేంద్రం పర్యవేక్షిస్తుందన్నారు. 115 బోట్లను వేర్వేరు ప్రాంతాల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్న ఆయన.. 50 పెద్ద బోట్లు, 56 చిన్న బోట్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

బోటు ప్రమాదాలు జరగకుండా కమాండ్ కంట్రోల్ కేంద్రం పర్యవేక్షణ
బోటు ప్రమాదాలు జరగకుండా కమాండ్ కంట్రోల్ కేంద్రం పర్యవేక్షణ

By

Published : Nov 4, 2020, 2:48 AM IST

బోట్లలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా... బోట్లను కమాండ్ కంట్రోల్ కేంద్రం పర్యవేక్షిస్తుందని... మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. 115 బోట్లను వేర్వేరు ప్రాంతాల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్న ఆయన.. 50 పెద్ద బోట్లు, 56 చిన్న బోట్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఏపీ యువజన విభాగం తరఫున యూట్యూబ్ ఛానల్ పెట్టటంతో పాటు..విశాఖకు కొట్టుకొచ్చిన ఓడను పర్యాటక రెస్టారెంట్​గా మార్చే యోచలో ఉన్నట్లు వెల్లడించారు.

సీ ప్లేన్​ను భవానీద్వీపం నుంచి సాగర్, విశాఖ మధ్య తిప్పనున్నట్లు తెలిపారు. పర్యాటక శాఖ రిసార్టులు, 38 రెస్టారెంట్లు నడపాలని భావిస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details