విశాఖ స్టీల్‌ప్లాంట్ ని ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకత ఎక్కవైంది. ఎంపీ సత్యనారాయణతో కలిసి ప్లాంట్‌కు సంబంధించిన కార్మిక సంఘాలతో.. మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశం అయ్యారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఉద్ధృతం చేద్దామన్న మంత్రి.. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించి.. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కితీసుకునేలా పోరాడతామని.. ఎంపీ సత్యనారాయణ తెలిపారు.
'కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా పోరాడతాం'
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయం.. కొండ నాలుకకి మందేస్తే.. ఉన్న నాలుక పోయినట్లుగా ఉందని.. మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు.
minister avanthi meeting