ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖ రాజధానిగా మారితే భారీగా పెట్టుబడులు' - minister avanthi comments on vishaka capital of ap news

విశాఖ ఎగ్జిక్యూటివ్​ రాజధానిగా మారితే పారిశ్రామికంగా, పర్యటక పరంగా భారీ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతమైతే ఉద్యమాలు పుట్టుకొచ్చే అవకాశం ఉందని అన్నారు.

minister avanthi comments on three capitals for AP
minister avanthi comments on three capitals for AP

By

Published : Dec 20, 2019, 7:01 PM IST

అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదన్న మంత్రి అవంతి
ఎగ్జిక్యూటివ్ రాజధాని కావడం వల్ల విశాఖ మరింతగా అభివృద్ధి చెందుతుందని పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే సీఎం జగన్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఒకే దగ్గర అభివృద్ధి జరిగితే ప్రాంతీయ ఉద్యమాలు పుట్టుకొచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అమరావతి ఉంటుందని.. దానితో పాటు విశాఖ, కర్నూలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. విశాఖ వాణిజ్య రాజధానిగా మారితే.. భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయని అవంతి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details