ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విషవాయువు ఘటనలో మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం' - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు

విశాఖ విషవాయువు బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ముత్తం శెట్టి తెలిపారు. గ్రామస్థులకు పరిహారం ఆల్​లైన్ ద్వారా చెల్లించి... గ్రామ వాలంటీర్ల ద్వారా వారికి నిధులు అందాయో లేదో సర్వే నిర్వహిస్తామని అన్నారు. ఘటనలో చనిపోయిన 12 మంది కుటుంబాల్లో కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీఎం తెలిపినట్లు మంత్రి ప్రకటించారు.

minister avanthi
minister avanthi

By

Published : May 18, 2020, 6:19 PM IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విషయంలో దోషులను ఉపేక్షించే పరిస్థితి లేదని మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కంపెనీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని ఎల్జీ పాలిమర్స్ సంస్థపై ఫిర్యాదు చేసే వారు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఘటన జరిగిన పది రోజుల్లోనే బాధితులకు పరిహారం అందించామని తెలిపారు. గ్రామస్థులకు పరిహారం ఆన్​లైన్ ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. వారికి పరిహారం అందిందో లేదో తెలుసుకునేందుకు గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారని తెలిపారు.

గ్రామంలో శాశ్వత ప్రాతిపదికన ఒక ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ లో సీఎం జగన్ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చనిపోయిన 12 మంది కుటుంబాల్లో కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఎల్జీ గ్యాస్ లీకేజ్ బాధిత గ్రామాల్లో సహాయక చర్యలో పాల్గొన్న రెవిన్యూ,పోలీస్, జీవీఎంసీ, వైద్య సిబ్బంది కి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:మనలా ఎవరూ స్పందించలేదు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details