విశాఖను రాజధానిగా కాకుండా చెయ్యాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలపై తెదేపా అధినేత వివక్ష చూపిస్తున్నారన్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు.
పోటీ ప్రపంచంలో మిగతా నగరాలకు దీటుగా విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మూడు రాజధానుల అంశాన్ని కౌన్సిల్లో తెదేపా అడ్డుకుందని ఆరోపించారు. ఈ విషయంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైఖరిని మంత్రి అవంతి తప్పుబట్టారు.