ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అచ్యుతాపురం సెజ్​ గ్యాస్​ లీకేజ్​ ఘటన.. ప్రాథమిక నివేదికలో ఏముందంటే..!

AMARANATH ON SEZ: అచ్యుతాపురం సెజ్​​ గ్యాస్ లీకేజ్​ ఘటనలో రెండు రసాయనాలు ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్​నాథ్ వెల్లడించారు. హైద్రాబాద్​లోని అధికారిక ల్యాబ్స్​లో ప్రమాదంలో వెలువడిన రసాయనాలు మీద పరిశోధన జరుగుతోందని వివరించారు.

AMARANATH ON SEZ
AMARANATH ON SEZ

By

Published : Jun 9, 2022, 6:03 PM IST

AMARANATH ON SEZ: అచ్యుతాపురం బ్రాండిక్స్​ సెజ్​ గ్యాస్ లీకేజ్​ ఘటనలో రెండు రసాయనాలు ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి ప్రాథమిక నివేదిక ఇచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్​నాథ్ వెల్లడించారు. ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని విశాఖలోని జల విహార్​లో మంత్రి తెలిపారు. బ్రాండిక్స్​లో పెస్ట్ కంట్రోల్ గ్యాస్ ఉన్నాయని.. ప్రమాదం అనంతరం 2.55 పీఎం క్లోరిన్ గాలిలో ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్పారని పేర్కొన్నారు. అందుకే బ్రాండిస్, పొరస్ కర్మాగారం పనులు ఆపినట్లు చెప్పారు. ఆ కాంప్లెక్స్​లో అనేక రసాయనాలు ఉన్నట్లు నివేదికలో స్పష్టం చేశారని.. హైద్రాబాద్​లోని అధికారిక ల్యాబ్స్​లో ప్రమాదంలో వెలువడిన రసాయనాలు మీద పరిశోధన జరుగుతోందని వివరించారు. తుది నివేదిక ఈ రోజు వస్తోందని.. నివేదిక వచ్చే వరకు ఆ కంపెనీలు మూసి ఉంచేలా ఆదేశాలు జారీ చేశామన్నారు.

అసలేం జరిగింది: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని (సెజ్‌) పోరస్‌ ల్యాబోరేటరీ పరిశ్రమను మూసేయాలని.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ ఏకే పరీడా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జల, వాయు కాలుష్యానికి కారణమైనందున తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని పేర్కొన్నారు. ఈనెల 3న ఇక్కడి ‘సీడ్స్‌’ అనే దుస్తుల తయారీ కంపెనీలో పనిచేసే 369 మంది మహిళా కార్మికులు విషవాయువుల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

దీనికి క్లోరిన్‌ వాయువే కారణమని పరిశ్రమల మంత్రి అమర్‌నాథ్‌ ప్రకటించిన రెండోరోజే పీసీబీ ఛైర్మన్‌ ‘సీడ్స్‌’ ఎదురుగా ఉన్న పోరస్‌ కంపెనీలో ఉత్పత్తులను నిలిపేయాలని ఆదేశించారు. నిజానికి కార్మికుల అస్వస్థతకు పోరస్‌ నుంచి విడుదలైన వాయువే కారణమని ప్రమాదం జరిగినరోజే పీసీబీ అధికారులతోపాటు మంత్రి ప్రకటించారు. తర్వాత ఏ వాయువు విడుదలైందో తెలియదని, నిపుణుల కమిటీ విచారణ తర్వాత నిజాలు వెల్లడిస్తామన్నారు.

సీడ్స్‌ పరిశ్రమలో ఎటువంటి రసాయనాలు వినియోగించకపోవడం, పైగా అది గ్రీన్‌జోన్‌లో ఉండటంతో సమీపాన పోరస్‌ నుంచే విష వాయువు విడుదలై ఉంటుందన్న ఆరోపణలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే పీసీబీ అధికారులు దానిపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:


ABOUT THE AUTHOR

...view details