ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై టీఎస్ సర్కారుతో మాట్లాడుతున్నాం' - సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై టీఎస్ సర్కారుతో మాట్లాడుతున్నాం తాజా వార్తలు

చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లే రోగులను సరిహద్దులో తెలంగాణ అధికారులు ఆపేసినట్లు గుర్తించామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడామని అధికారులను ఆదేశించామన్నారు.

'సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై టీఎస్ సర్కారుతో మాట్లాడుతున్నాం'
'సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై టీఎస్ సర్కారుతో మాట్లాడుతున్నాం'

By

Published : May 14, 2021, 3:15 PM IST

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపేసినట్లు గుర్తించామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈ విషయమై తెలంగాణ అధికారులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించామన్నారు. వారి నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

కొవిడ్ ఆసుపత్రుల్లో చాలా మంది రోగులు అవసరం లేకపోయినా ఆక్సిజన్ వినియోగిస్తున్నారన్నారు. కొందరు భోజనానికి, శౌచాలయాలకు వెళ్లే సమయాల్లో రెగ్యూలేటర్ కట్టేయకుండా వెళ్లటం వల్ల ఆక్సిజన్ వృథా అవుతోందన్నారు. వృథాను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

ఇదీచదవండి: తెలంగాణ వాహనాలు ఏపీలోకి రాకుండా భాజపా ఆధ్వర్యంలో ఆందోళన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details