ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛను: మంత్రి అవంతి

విశాఖలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్​పై ప్రతిపక్షాలు విషపూరితమైన ప్రచారం చేస్తున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామని తెలిపారు. పింఛన్ల జాబితా నుంచి పేర్లు తొలగిపోయిన వారు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని.. దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.

minister aavanthi comments on land pooling in vishaka
minister aavanthi comments on land pooling in vishaka

By

Published : Feb 10, 2020, 7:37 PM IST

అర్హులందరికీ పింఛను అందిస్తామన్న మంత్రి అవంతి

అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛను తొలగించమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో మాట్లాడిన ఆయన... పింఛన్ల జాబితా నుంచి పేర్లు తొలగిపోయిన వారు రీ వెరిఫికేషన్ ఫాంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 15 వరకు తుది గడువు ఉందని తెలిపారు. తెదేపా ప్రభుత్వం హయంలో ఇష్టానుసారంగా అనర్హులకు పింఛన్లు ఇచ్చారని... అలాంటి వాటిని గుర్తించి జాబితాల నుంచి పేర్లు తొలగించామని చెప్పారు.

మంచిపేరు వస్తుందనే విమర్శలు...

ల్యాండ్​పూలింగ్​పై విపక్షాలు చేస్తున్న విమర్శలు సరికావని మంత్రి అవంతి అన్నారు. ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై విషపూరిత ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. భూములు ఇచ్చే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నామని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నామని అన్నారు.

ఇదీ చదవండి:

11 జాతీయ సంస్థలతో ప్రభుత్వ 'భరోసా' ఒప్పందాలు

ABOUT THE AUTHOR

...view details