విశాఖ నగరానికి చెందిన టాలెంట్ ఆరిజన్ సేవా సంఘం (టాస్) ఆధ్వర్యంలో యువకులు.. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న కూలీలు, పేదలకు నిత్యం సహాయం చేస్తున్నారు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి నగరంలోని శివానిపాలెం, కంచరపాలెం, జయప్రకాష్ నారాయణ్ నగర్, ఐటీఐ కూడలి, 104 ఏరియా తదితర ప్రాంతాల్లో పేదవారు, నిరాశ్రయులను గుర్తించి రోజుకి 1000 ప్యాకెట్ల ఆహారం అందిస్తున్నారు. కరోనా నియంత్రణకు విధులు నిర్వహిస్తున్న పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఆహారం ఇస్తున్నారు.
టాస్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ - విశాఖ జిల్లా తాజా వార్తలు
కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదవారికి ఆహారం అందించాలని ఆ యువకులు భావించారు. నిరాశ్రయులు, అభాగ్యులను గుర్తించి వారికి రోజూ నిత్యావసరాలు, ఆహారం అందిస్తున్నారు.
Tass
నగరంలోని వివిధ ప్రాంతాల్లో పేదవారిని గుర్తించి, నిత్యావసర సరకులను భౌతిక దూరాన్ని పాటిస్తూ వారివారి ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు టన్నుల బియ్యం, ఒక టన్ను పప్పు సరఫరా చేసినట్లు టాస్ సంస్థ చైర్మన్ హరి నారాయణ తెలిపారు.